Vijay Devarakonda: బర్త్ డే పోస్టర్ లో మరింత స్టైల్ గా రౌడీ హీరో

పెళ్లి చూపులు(Pelli Chupulu) సినిమాతో హీరోగా మారిన విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ఆ తర్వాత అర్జున్ రెడ్డి(Arjun Reddy) సినిమాతో సంచలనం సృష్టించాడు. తర్వాత పలు సినిమాలు చేసిన ఒక్కో సినిమాతో తన క్రేజ్ ను పెంచుకున్న విజయ్ కు గత కొంతకాలంగా సరైన సక్సెస్ లేదు. దీంతో విజయ్ తన ఆశలన్నింటినీ తన రాబోయే సినిమా కింగ్‌డమ్(Kingdom) పైనే పెట్టుకున్నాడు.
జెర్సీ(Jersey) ఫేమ్ గౌతమ్ తిన్ననూరి(Gowtham Thinnanuri) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై విజయ్ చాలానే అంచనాలు పెట్టుకున్నాడు. ఈ సినిమా నెక్ట్స్ లెవెల్ లో ఉంటుందని ఆల్రెడీ కింగ్‌డమ్ గ్లింప్స్ చూశాక క్లారిటీ కూడా వచ్చింది. కింగ్‌డమ్ గ్లింప్స్ సినిమాపై ఉన్న అంచనాల్ని భారీగా పెంచేసింది. ఇదిలా ఉంటే ఇవాళ విజయ్ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఈ పోస్టర్ లో విజయ్ దేవరకొండ లుక్ చాలా స్టైలిష్ గా ఎంతో ఫిట్ గా ఉన్నాడు. నల్ల కళ్లద్దాలు పెట్టుకుని చిన్న జుట్టుతో విజయ్ మునుపెన్నడూ కనిపించని విధంగా కనిపిస్తున్నాడు. కింగ్‌డమ్ సినిమా కోసం విజయ్ తన లుక్ తో పాటూ హెయిర్ స్టైల్ ను కూడా పూర్తిగా మార్చిన సంగతి తెలిసిందే. సితార(Sithara Entertainments) బ్యానర్ లో నాగవంశీ(naga Vamsi) నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.