విజయ్ కు అడ్డు పడని లైగర్ ఎఫెక్ట్
సినిమాల బిజినెస్ హీరోల ఇమేజ్ మీద డిపెండై ఉంటుంది. వారి నుంచి వచ్చిన చివరి సినిమాలు, వాటి కలెక్షన్లను బట్టే రాబోయే సినిమాల బిజినెస్ లు జరుగుతుంటాయి. ఫెయిల్యూర్ హీరోల కొత్త సినిమాలకు బిజినెస్ పరంగా ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. అందులోనూ వారి ఖాతాలో ఇండస్ట్రీ డిజాస్టర్ ఉంటే ఇక తర్వాతి సినిమా బిజిసెన్ లెక్కలు చాలా దారుణంగా మారుతాయి.
కానీ విజయ్ దేవరకొండ విషయంలో మాత్రం ఇది మినహాయింపుగా కనిపిస్తుది. విజయ్ నుంచి వచ్చిన గత మూడు సినిమాలూ డిజాస్టర్లన్న విషయం తెలిసిందే. గీత గోవిందం సినిమానే విజయ్ కు ఆఖరి హిట్. ఆ తర్వాత వచ్చిన డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్, రీసెంట్గా వచ్చిన లైగర్ అన్నీ ఫ్లాపులే. ముఖ్యంగా లైగర్ అయితే టాలీవుడ్ లోని పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది.
దీంతో విజయ్ నెక్ట్స్ సినిమాపై ఆ ఎఫెక్ట్ బాగా పడుతుందనుకున్నారు కానీ ఖుషి అందరి అంచనాలను మించి సూపర్బ్ గా బిజినెస్ చేసింది. లైగర్ తర్వాత విజయ్ కెరీర్లో పెద్ద రేంజ్ బిజినెస్ చేసిన సినిమా ఖుషినే. ఈ సినిమ వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ రూ.52 కోట్లు పలికాయి. ఆంధ్రా హక్కులు రూ.20 కోట్లు, సీడెడ్ రూ.6కోట్లు, నైజాం రైట్స్ రూ.15 కోట్లు రాబట్టిన ఈ మూవీ ఓవర్సీస్ ద్వారా రూ.7.5 కోట్లు రాబట్టింది. సినిమాకు మంచి టాక్ వస్తే బ్రేక్ ఈవెన్ అవడం కష్టమేమీ కాదు. మరి ఖుషి తో విజయ్ ఏ మేరకు కలెక్ట్ చేస్తాడో చూడాలి.













