సీఎంగా అర్జున్ రెడ్డి
అనూహ్యంగా అసాధారణ విజయం సాధించిన అర్జున్ రెడ్డితో యువతను మెప్పించి తనకుంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకున్నాడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ఆయన తెలుగుతో పాటు తమిళ భాషలో కూడా నటిస్తున్నాడు. ఇరుముగన్ ఫెమ్ ఆనంద్ శంకర్ తమిళ భాషలో తెరకెక్కిస్తున్న నోటా అనే చిత్రంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. పూర్తిగా రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ సరసన మెహ్రీన్ హీరోయిన్గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేశారు. పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ కంప్లీట్ చేసి ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. స్టూడియో గ్రీన్ పతాకంపై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఎన్నికల ముందు ఈ చిత్రం విడుదల కానుండడం గమనార్హం.













