కెఎల్ఎం మాల్ ఫ్యాషన్ మాల్‌ను ప్రారంభించిన విజయ్ దేవరకొండ
హైదరాబాద్‌లోని ఎఎస్‌రావునగర్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన కెఎల్ఎం ఫ్యాషన్ మాల్‌ను టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ గురువారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మాల్లోని నాలుగు అంతస్తుల్లో ఉన్న వస్త్ర డిజైన్లను చూసి మురిసిపోయారు. నగర శివారు ప్రాంతాల ప్రజల సౌకర్యార్థం ఇక్కడ కెఎల్ఎం ఫ్యాషన్మాల్ను ప్రారంభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. సంస్థ సిఇఓ కళ్యాణ్ మాట్లాడుతూ, ఇప్పటికే కళామందిర్, వరమహాలక్ష్మి సిల్క్స్, మందిర్, ఆర్ బ్రాండ్లతో 26 బ్రాంచులతో, మూడు వేల మంది ఉద్యోగులతో గత 12 ఏళ్లుగా నిర్విరామ కషితో లక్షలాది మంది వినియోగదారులకి దగ్గరయ్యా. ఇప్పుడు అతి తక్కువ ధరలతో అంతర్జాతీయస్థాయి ఫ్యాషన్స్ ను హైదరాబాద్ వాసులకి అందించే ఆలోచనతో ఈ కె.ఎల్.ఎం ఫ్యాషన్ మాల్ ను ఏర్పాటు చేశామన్నారు. తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని కెఎల్ఎం ఫ్యాషన్మాల్ను ప్రారంభింస్తామని చెప్పారు. నటుడు విజయ్ దేవరకొండను చూసేందుకు అభిమానులు మాల్ దగ్గరకు పెద్ద సంఖ్యలోరావడంతో ఆ ప్రాంతమంతా క్రిక్కిరిసిపోయింది.













