ప్రభాస్ సినిమాతో విజయ్ సినిమాకు లింకు
డియర్ కామ్రేడ్, వరల్డ ఫేమస్ లవర్, లైగర్ సినిమాలతో వరుస డిజాస్టర్లు అందుకున్న విజయ్ దేవరకొండకు ఖుషి సినిమా ఫలితం కాస్త ఊరటనిచ్చింది. ఖుషి బ్లాక్ బస్టర్ కాకపోయినా ఫర్వాలేదనిపించింది. ప్రస్తుతం విజయ్, పరశురామ్ పెట్ల దర్శకత్వంలో ఫ్యామిలీ స్టార్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఏప్రిల్ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై ఆడియన్స్ కు మంచి అంచనాలున్నాయి. ఫ్యామిలీ స్టార్ తర్వాత విజయ్ దేవరకొండ తన తర్వాతి సినిమాను గౌతమ్ తిన్ననూరితో చేయనున్న విషయం తెలిసిందే. పీరియాడికల్ జానర్లో ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు గౌతమ్.
భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా రూపొందనుంది. యాక్షన్ బ్యాక్ డ్రాప్ తెరకెక్కనున్న ఈ సినిమాలో విజయ్ పోలీసాఫీసర్‌గా కనిపించనున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా కథాంశం శ్రీలంక బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని తెలుస్తోంది. టాలీవుడ్ లో ఈ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమా ప్రభాస్ నటించిన ఛత్రపతి.
ఛత్రపతి అప్పట్లో ప్రభాస్ కెరీర్లోనే మంచి హిట్ గా నిలిచింది. ఇప్పుడు విజయ్ తో చేయబోయే పీరియాడికల్ మూవీ కోసం గౌతమ్ కూడా శ్రీలంక నేపథ్యం తీసుకుంటుడటంతో ఛత్రపతిలానే ఈ సినిమా కూడా మంచి హిట్ అవుతుందని విజయ్ ఫ్యాన్స్ ఆనంద పడుతున్నారు. అంతేకాదు ఛత్రపతి సినిమాలో లానే ఈ సినిమాలో కూడా హో ఓల్టేజ్ డ్రామా, గొప్ప ఎమోషనల్ ఎలిమెంట్స్ ఉంటాయని తెలుస్తోంది. ఏప్రిల్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.













