Vijay Devarakonda: జాగ్రత్తగా అడుగులేస్తున్న రౌడీ హీరో
టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ ఆ సినిమాలన్నింటితో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda). అర్జున్ రెడ్డి(Arjun Reddy), గీత గోవిందం(Geetha Govindam) సినిమాల తర్వాత ఫ్యామిలీ స్టార్(Family Star) వరకు వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ వచ్చాడు విజయ్. కానీ ఆ సినిమా ఫలితాల వల్లే విజయ్ ఇప్పుడు స్లో గా సినిమాలు చేయడం మొదలు పెట్టాడు.
తన దూకుడు తగ్గించి నిదానమే ప్రధానమనే సూత్రాన్ని పాటిస్తున్నాడు విజయ్. ప్రస్తుతం జెర్సీ(Jersey) ఫేమ్ గౌతమ్ తిన్ననూరి(Gowtham Thinnanuri) దర్శకత్వంలో తన 12వ సినిమాను చేస్తున్నాడు విజయ్. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చిలో రిలీజ్ కానుంది. ప్రస్తుతం విజయ్ నటిస్తున్న సినిమా ఇదొక్కటే. విజయ్ సినిమాల విషయంలో మునుపటిలా దూకుడు ప్రదర్శించడం లేదు.
కథల విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నాడు. రాహుల్ సాంకృత్స్యన్(Rahul Sankrithyan) తో ఓ మూవీ, రవి కిరణ్ కోలా(Ravi Kiran Kola)తో ఓ సినిమా చేయడానికి విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ వాటిని వీడీ12(VD12) రిలీజ్ అయ్యాకే మొదలు పెట్టాలని చూస్తున్నాడు విజయ్. ఒకేసారి రెండు సినిమాలు చేయడం విజయ్ కు కూడా కలిసిరాని నేపథ్యంలో ఇదే బెటరని తన ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు.













