వీరజవాన్ల కుటుంబాలకి సాయం చేసిన అర్జున్ రెడ్డి
అర్జున్ రెడ్డి చిత్రంతో దేశవ్యాప్తంగా ఆదరణ పొందిన నటుడు విజయ్ దేవరకొండ. గతంలో కేరళ వరద బాదితుల కోసం ముందుగా విరాళం ప్రకటించి ఆదర్శంగా నిలిచిన ఈ యువ సంచలనం తాజాగా మళ్లీ వార్తల్లో నిలిచారు. పుల్వామాలో ముష్కరుల మానవ బాంబు దాడిలో అమరులైన వీరజవాన్ల కుటుంబాలకు అంతా సంతాపం తెలుపుతుంటే విజయ్ దేవరకొండ ఒక్కడే అర్థిక సహాయాన్ని అందించడం సంచలనంగా మారింది.
తన ట్విట్టర్లో ఆర్థిక సాయం అందించిన సర్టిఫికెట్‌ను షేర్ చేస్తూ.. సైనికులు మన కుటుంబాలని రక్షిస్తున్నారు. ఇప్పుడు వారి కుటుంబాలకి అండగా నిలవాల్సిన సమయం వచ్చింది. సాయంతో మన సైనికుల జీవితాలని వెలకట్టలేము. కాని మనం మనవంతు సహాకారం అందిద్ధాం. నాకు తోచినంత సాయం నేను చేశాను. మనమందరం కలిసి వారికి ఎంతో కొంత సాయం చేసి మన సపోర్ట్‌ని అందిద్దాం అని అన్నాడు.













