ఆ రిస్క్ చేయబోతున్న విజయ్
వయసుతో సంబంధం లేకుండా ఒకప్పుడు హీరోలే తండ్రులు, తాతలుగా నటించేవాళ్లు. ఆ టైమ్ లో ఆడియన్స్ కూడా యాక్సెప్ట్ చేశారు. సీనియర్ ఎన్టీఆర్ కు ఈ కేటగిరీలో ఎన్నో బ్లాక్ బస్టర్లున్నాయి. చిరంజీవి కెరీర్ స్టార్టింగ్ లోనే సింహపురి సింహం చేశాడు. వెంకటేష్ సూర్యవంశం లాంటి హిట్ కొట్టాడు. అయితే ఇప్పుడు మారుతున్న కాలంలో వచ్చిన మార్పుల వల్ల ఈ తండ్రీ కొడుకుల డ్యూయల్ రోల్ ఫార్ములా వర్కవుట్ అవడం లేదు.
ప్రెజెంట్ జెనరేషన్లో అలాంటి స్టోరీలు రాసేవాళ్లు కూడ తగ్గిపోయారు. జూ. ఎన్టీఆర్ ను ఆంధ్రావాలాలో కేవలం ఫ్లాష్ బ్యాక్ లో తండ్రిగా చూసేందుకే ఫ్యాన్స్ ఇష్టపడలేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఇలాంటి రిస్క్ చేయడానికి విజయ్ దేవరకొండ రెడీ అవుతున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో విజయ్ చేయబోయే పీరియాడిక్ డ్రామాలో విజయ్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు తెలుస్తోంది.
కాకపోతే ఒకే ఫ్రేమ్ లో రెండు గెటప్స్ లో కనిపిస్తాడా లేదా శ్యామ్ సింగరాయ్ సినిమాలో లాగా వేర్వేరు గా చూపించి ఏదైనా ప్రయోగం చేస్తాడా అన్నది చూడాలి. అసలే నెరిసిన జుట్టు విజయ్ కు అసలు సెట్ అవదు. అలాంటప్పుడు రాహుల్ విజయ్ తో ఇలాంటి ప్రయోగం ఎలా చేస్తాడా అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. ఫ్యామిలీ స్టార్ సినిమాతో దారుణమైన ఫ్లాప్ ఎదుర్కొన్న విజయ్ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తన 12వ సినిమాను చేస్తున్నాడు. వచ్చే ఏడాది సమ్మర్ కు ఈ సినిమా రిలీజయ్యే ఛాన్సుంది.













