సిక్కోలుకు దేవరకొండ సాయం
మనసున్న మనిషినని చాటుకున్నాడు సినీ హీరో దేవరకొండ విజయ్. తితలీ తుఫానుతో అతలాకుతలమైన సిక్కోలు వాసులకు అండగా నిలుస్తున్నట్లు ప్రకటించారు. వెంటనే రూ.5 లక్షలను సీఎం రిలీఫ్ ఫండ్‌కు బదిలీ చేశారు. ఆ లావాదేవీకి సంబంధించిన స్క్రీన్ షాట్‌ను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. లెహ్‌లో వున్న నాకు వార్త ఇప్పుడే అందింది. ఈసారి అది మనకే. నాతో చేతులు కలపండి. ప్రతి సాయమూ గొప్పదే. గతంలో నాతోపాటు కేరళకు సాయం చేశారు. మరో సారి చేద్దాం. ఆంధ్రప్రదేశ్ నేను, నా అభిమానులు నీతో ఉన్నాం అంటూ ట్వీట్ చేశారు. దేవరకొండ ట్వీట్‌కు అభిమానులు వెంటనే స్పందించారు.













