Vijay Devarakonda: బాలీవుడ్ పై విజయ్ దేవరకొండ సంచలన కామెంట్స్
గత కొన్ని సినిమాలుగా వరుస ఫ్లాపులు అందుకుంటున్న విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) తాజాగా బాలీవుడ్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. విజయ్ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, సౌత్ సినిమా గురించి మాట్లాడుతూ ఆ సందర్భంగానే బాలీవుడ్ గురించి కూడా మాట్లాడాడు. దక్షిణాది చిత్ర పరిశ్రమ స్థాయి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా బాగా పెరిగిందన్నాడు.
ఒకప్పుడు దక్షిణాది సినిమాలకు అసలు గుర్తింపే ఉండేది కాదని, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సౌత్ సినిమాలకు క్రేజ్ పెరుగుతుందని, ఆడియన్స్ కూడా సౌత్ సినిమాలను చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారని, సౌత్ నుంచి బాహుబలి(Baahubali) లాంటి సినిమా వస్తుందని ఎవరూ ఊహించలేదని, ఆ సినిమా కోసం ప్రతీ ఒక్కరూ ఎంతో కష్టపడ్డారని, దాని కోసం ఒక్కొక్కరు ఐదేళ్ల పాటూ కష్టపడి దానికి తగ్గ ఫలితాన్ని అందుకున్నారని, ఆ రిజల్ట్ ను టాలీవుడ్ మొత్తం అందుకుందని విజయ్ తెలిపాడు.
బాహుబలి లాంటి సినిమాలను చూసి బాలీవుడ్ కూడా ఇన్స్పైర్ అయి సక్సెస్ అవాలని, బాలీవుడ్ కు కూడా పూర్వ వైభవం వస్తుందని విజయ్ అన్నాడు. ఫిల్మ్ ఇండస్ట్రీ ఓ సర్కిల్ లాంటిదని, రానున్న ఐదు, పదేళ్ల సిట్యుయేషన్స్ మారతాయని, బాలీవుడ్ లో ఉన్న లోటును తీర్చడానికి కొత్త డైరెక్టర్లు వచ్చి హిందీ సినిమా స్థాయిని పెంచుతారని, అయితే ఆ డైరెక్టర్లు ముంబైకు చెందిన వారు కాకుండా బయటివారే అవుతారనిపిస్తోందని విజయ్ జోస్యం చెప్పాడు. బాలీవుడ్ పై విజయ్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి.













