ఖుషి సినిమాకు ఆ టైటిల్ వద్దనుకున్నా..
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, టాలీవుడ్ క్వీన్ సమంత కాంబినేషన్ లో సినిమా వస్తుందని తెలియగానే అందరిలో ఎంతో ఎగ్జయిట్మెంట్ కనిపించింది. వీరద్దరూ ఎవరికి వారే మంచి ఫాలోయింగ్ ఉన్న నటులు. వీరి కాంబోలో ఓ లవ్ స్టోరీ వస్తుందని, అది కూడా పవన్ బ్లాక్ బస్టర్ మూవీ ఖుషి టైటిల్‌తో తెరకెక్కుతుందని, ఆ మూవీకి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడని, మూవీని మైత్రీ నిర్మిస్తుందని తెలియడంతో అందరికీ ఈ సినిమాపై ముందు నుంచే అంచనాలు పెరిగాయి.
సినిమా మొదట్లో వేగంగా షూటింగ్ జరుపుకున్న ఖుషికి తర్వాత మాత్రం బ్రేకులు పడ్డాయి. ముందేమో లైగర్ ప్రమోషన్ల కోసం విజయ్ బ్రేక్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఆరోగ్యం బాలేక సమంత వల్ల షూటింగ్ కు బ్రేక్ వచ్చింది. రీసెంట్‌గానే సమంత ఆరోగ్యం కుదుటపడటంతో మళ్లీ ఖుషి షూటంగ్ పునః ప్రారంభమైన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి డైరెక్టర్ శివ నిర్వాణ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. సమంత అందుబాటులోకి వచ్చాక యూనిట్ అంతా కలిసి 30 రోజుల పాటు నిర్విరామంగా షూట్ చేశామని, తర్వాత హైదరాబాద్‌లో కూడా కొంత షూట్ జరిగిందని, దీంతో ఖుషి దాదాపు షూట్ పూర్తి కావల్సి వచ్చిందని ఆయన తెలిపాడు.
ఖుషి సినిమా చెప్పిన ప్రకారమే సెప్టెంబర్ 1న రిలీజ్ కానుందని, హీరోయిన్ క్యారెక్టర్ రాస్తున్నప్పుడే ఆ పాత్రకు సమంత తప్ప మరెవరూ న్యాయం చేయలేరని అనిపించి సమంతను ఎంచుకున్నట్లు చెప్పాడు శివ. మొదట్లో ఈ సినిమాకు ఖుషి అనే టైటిల్ మనసులో ఉన్నప్పటికీ, ఆ టైటిల్ వద్దని వేరే టైటిల్స్ చాలా ప్రయత్నించామని, కానీ ఖుషి తప్ప ఇంకేదీ యాప్ట్ అనిపించకపోవడంతో దాన్నే ఫైనల్ చేసినట్లు, శివ చెప్పుకొచ్చాడు.













