Vijay-Rashmika: సైలెంట్ గా నిశ్చితారం చేసుకున్న విజయ్- రష్మిక

ఎప్పట్నుంచో టాలీవుడ్ లో వినిపిస్తున్న ప్రేమ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టారు రౌడీ హీరో విజయ్ దేవరకొండ(vijay devarakonda), నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(rashmika mandanna). తమ మధ్య ఉన్నది ఫ్రెండ్‌షిప్ మాత్రమే కాదని చెప్తూ, ఇద్దరూ సైలెంట్ గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. ఈ ఎంగేజ్‌మెంట్ ఇరువురు కుటుంబ సభ్యులు మరియు అత్యంత సన్నిహితుల నడుమ జరిగినట్టు సమాచారం.
గీత గోవిందం(geetha govindam) సినిమాతో వీరిద్దరికి పరిచయం ఏర్పడగా, ఆ సినిమా షూటింగ్ టైమ్ నుంచే ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఆ తర్వాత విజయ్, రష్మిక కలిసి డియర్ కామ్రేడ్ చేశారు. డియర్ కామ్రేడ్(dear comrade) టైమ్ నుంచే వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని ఎన్నో వార్తలొచ్చాయి. ఇద్దరూ కలిసి ట్రిప్స్ కు వెళ్లడం, అక్కడ ఫోటోలు దిగడంతో అందరూ వీరు ప్రేమలో ఉన్నారనే అనుకున్నారు.
అయితే ఎన్ని వార్తలొచ్చినా అటు విజయ్ కానీ, ఇటు రష్మిక కానీ ఎప్పుడూ ఆ వార్తలపై రెస్పాండ్ అయింది లేదు. ఇటీవలే తమ రిలేషన్ గురించి ఇన్‌డైరెక్ట్ గా హింట్స్ ఇస్తూ వచ్చిన ఈ జంట, ఇప్పుడు నిశ్చితార్థం చేసుకుని అందరికీ షాకిచ్చారు. నెక్ట్స్ ఇయర్ ఫిబ్రవరి నెలాఖరున వీరి పెళ్లి జరగనుందని తెలుస్తోంది. అయితే ఈ సైలెంట్ ఎంగేజ్‌మెంట్ గురించి త్వరలోనే విజయ్, రష్మిక అఫీషియల్ గా అనౌన్స్ చేసే అవకాశాలు లేకపోలేదు.