జనగణమన గురించి తెలివిగా ఆన్సరిచ్చిన విజయ్
లైగర్ సినిమా కలెక్షన్లు రూ.200 కోట్ల నుంచి మొదలవుతాయని, సినిమా ఇండియా మొత్తాన్ని షేక్ చేసేస్తుందని లైగర్ రిలీజ్‌కు ముందు ఎంతో హడావుడి చేశాడు విజయ్. కానీ రిలీజ్ తర్వాత ఫలితం ఎవరి ఊహలకు అందని రీతిలో బాక్సాఫీస్ వద్ద దారుణమైన డిజాస్టర్‌గా మిగిలింది. దీంతో విజయ్ సైలెంట్ అయ్యాడు.
అయితే కొంచెం గ్యాప్ తర్వాత రీసెంట్గా సైమా వేడుకలకు వెళ్లాడు విజయ్. అక్కడ జనగణమన గురించి విజయ్‌ని ఒక రిపోర్టర్ అడిగాడు. లైగర్ తర్వాత ఈ సినిమా చేయాలని కొన్ని నెలల ముందే ఈ సినిమాను గ్రాండ్‌గా లాంఛ్ చేసిన విషయం తెలిసిందే. లైగర్ డిజాస్టర్ కావడంతో ఆ సినిమా ఆగిపోయినప్పటికీ పూరీ కానీ, విజయ్ కానీ దీనిపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
ఈ నేపథ్యంలో విజయ్ను సినిమా గురించి అడిగితే చాలా తెలివిగా ఆన్సర్‌ను దాటవేశాడు. మనందరం వచ్చింది సైమా వేడుకలను ఎంజాయ్ చేయడానికి, దానికి పరిమితమవుదామంటూ ఆన్సరిచ్చాడు. గతంలో తన ఫెయిల్యూర్ల గురించి చెప్పుకోవడానికి అసలు ఇబ్బంది పడని విజయ్, జనగణమన గురించి అడిగితే ఇలా ఆన్సర్ ఇచ్చాడంటే, తనపై లైగర్ ఎఫెక్ట్ ఏ రేంజ్లో పడిందో అర్థం చేసుకోవచ్చు.













