బాలన్ వెంట పడుతున్న బయోపిక్స్
ఇంతకుముందు సిల్మ్ స్మిత బయోపిక్‌గా రూపొందిన డర్టీ పిక్చర్లో నటించి మెప్పించిన విద్యాబాలన్.. తాజాగా ఎన్టీఆర్ బయోపిక్తోనూ ఆకట్టుకోవడం తెలిసిందే. దాంతో పలు భాషల్లో బయోపిక్స్ బాలన్ వెంట పడుతున్నాయి. తమిళంలో జయలలిత బయోపిక్ కోసం ముందుగా విద్యాబాలన్‌నే సంప్రదించారు. కారణాంతరాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. అయితేనేం.. హిందీలో రూపొందనున్న ఇందిరాగాంధీ, గణిత శాస్త్రజ్ఞురాలు శకుంతలాదేవి బయోపిక్స్ కోసం విద్యాబాలన్‌ను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని విద్యా స్వయంగా ప్రకటించింది. ఇందిరా, శంకుతల వంటి కారణజన్ముల బయోపిక్స్‌లో నటించడం నాకెంతో సంతోషంగానూ, గర్వంగానూ ఉందని బాలన్ చెబుతోంది.













