మరో బయోపిక్ కు విద్యాబాలన్ గ్రీన్ సిగ్నల్
బాలీవుడ్ నటి విద్యాబాలన్ ఇటీవల ఎన్టీఆర్ కథానాయకుడు లో బసవతారకం పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించింది. ఈ చిత్రంలో తన నటనతో ఆమె ప్రేక్షకులను మైమరపించింది. అయితే విద్యాబాలన్ ఇప్పుడు బయోపిక్ చిత్రాలకు ఆప్షన్లా మారింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌లో కూడా ఆమె నటించనుంది. ఇక తాజాగా మరో బయోపిక్కు విద్యాబాలన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. మానవ కంప్యూటర్, ప్రముఖ మ్యాథమెటీషియల్ శకుంతల దేవి జీవితం ఆధారంగా తెరకెక్కనున్న బయోపిక్‌లో ఆమె నటించనుంది. ఈ చిత్రంలో శకుంతల దేవి పాత్రలో విద్యాబాలన్ కనిపించనుంది. అను మీనన్ రూపొందించనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది.













