బసవతారకం పాత్రలో విద్యాబాలన్?
పరిణీత పా కహాని, డర్టీపిక్చర్ వంటి చిత్రాల్లో అద్భుతమైన అభినయాన్ని కనబరిచి హిందీ చిత్రసీమలో ప్రతిభావంతురాలైన కథానాయికగా గుర్తింపుని సంపాదించుకుంది విద్యాబాలన్. తాజాగా ఈ సుందరి తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేయబోతున్నది. దివంగత మహానటుడు ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా రూపొందిస్తున్న చిత్రం ఎన్టీఆర్. ఆయన తనయుడు బాలకృష్ణ టైటిల్ రోల్‌ని పోషిస్తున్నారు. యన్.బి.కె ఫిల్మ్స్ పతాకంపై బాలకృష్ణ, విష్టువర్థన్, సాయికొర్రపాటి నిర్మిస్తునారు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 5 నుంచి ప్రారంభం కానుంది. ఇందులో ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో విద్యాబాలన్ నటించనున్నట్టు సమాచారం. బసవతారకం పాత్ర ఔన్నత్యం నచ్చడంతో విద్యాబాలన్ ఈ సినిమాకు వెంటనే అంగీకరించిందని చెబుతున్నారు.













