ఎన్ టీఆర్ లో బసవతారకం లుక్ విడుదల
నందమూరి తారక రామారావు జీవితాధారంగా తెరకెక్కుతున్న చిత్రం యన్టీఆర్. క్రిష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమాలోని ప్రధాన పాత్రధారుల ఫస్ట్‌లుక్‌లను చిత్ర బృందం విడుదల చేసింది. ఇప్పుడు ఎన్టీఆర్ సతీమణి బసవతారకం లుక్ బయటికి వచ్చింది. ఆమె పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటిస్తున్నారు. బసవతారకంలా తయారై అద్దం ముందు కూర్చుని తన అందాన్ని చూసుకుంటున్న ఫొటొను విద్యా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఫొటోపై నేనుం చూస్తున్నాను అని రాశారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శరవేగంగా ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఎన్బీకే ఫిల్మ్స్, వారాహి చలన చిత్ర పతాకంపై బాలకృష్ణ, సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు.













