ఎన్ట్‌ఆర్ లో బసవతారకం లుక్ విడుదల
మహానటుడు ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా రూపుదిద్దుకొంటున్న బయోపిక్ యన్.టి.ఆర్. కథానాయకుడు సంక్రాంతి ప్రేక్షకుల ముందుకు రావడం కోసం తుదిమెరుగులు దిద్దుకుంటోంది. నేడు ఈ చిత్రం ఆడియో వేడుక జరగనుంది. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రను పోషిస్తున్న విద్యాబాలన్ హార్మోనియం వాయిస్తుంటే, ఎన్టీఆర్ పాత్రధారి బాలకృష్ణ ప్రేమగా ఆమె వంకే చూస్తున్నట్లుగా ఉన్న ఆ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. అలాగే రావణాసురుడి గెటప్‌లో ఉన్న బాలకృష్ణ స్టిల్ కూడా అభిమానులను ఆకట్టుకుంటోంది. క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయి కొర్రపాటి, విష్టువర్థన్ ఇందూరి, ఎం.ఆర్.వి. ప్రసాద్ నిర్మాతలు.













