బసవతారకం కు బాలయ్య ఘన స్వాగతం
అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ బాలీవుడ్ నటి విద్యాబాలన్‌కు ఘన స్వాగతం పలికారు. ఆయన కథానాయకుడిగా తెరకెక్కిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ ఎన్టీఆర్ లో విద్యాబాలన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆమె బసవతారకం పాత్ర పోషిస్తున్నారు. కాగా ఈ సినిమా సెట్లో ఆమె అడుగుపెట్టారు. అంతకు ముందే హైదరాబాద్ వచ్చిన ఆమె బాలకృష్ణ, ఆయన కుటుంబ సభ్యుల్ని కలుసుకున్నారు. ఈ సందర్భంగా బాలయ్య, విద్యాబాలన్‌కు అతిథి మర్యాదలు చేశారు. ఆమెకు అందమైన చీరను కూడా బహుమతిగా ఇచ్చారు. ఈ మేరకు తీసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బాలయ్య సతీమణి వసుంధర దేవి, కుమార్తె తేజస్విని, విద్యాబాలన్‌కు చీర అందించారు. క్రిష్ జాగర్లమూడి ఎన్టీఆర్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడుగా రానా కనిపించనున్నారు. ఈ సినిమా నిర్మాణ బాధ్యతలను బాలయ్య చూసుకుంటున్నారు. సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తునట్టన్లు సమాచారం.













