Jailer2: రజినీ సరసన బాలీవుడ్ హీరోయిన్

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్(rajinikanth) చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలున్నాయి. అందులో ఒకటి కూలీ(Coolie) కాగా రెండోది జైలర్(jailer). లోకేష్ కనగరాజ్(lokesh kanagaraj) దర్శకత్వంలో కూలీ సినిమా షూటింగ్ ను ఇప్పటికే పూర్తి చేశారు రజినీకాంత్. ప్రస్తుతం ఆ యాక్షన్ థ్రిల్లర్ కు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ సినిమా రిలీజ్ కాకముందే రజినీకాంత్ తన నెక్ట్స్ మూవీ జైలర్2(jailer2) ను సెట్స్ పైకి తీసుకెళ్తున్నారు.
జైలర్(Jailer) సినిమాకు సీక్వెల్ గా ఈ జైలర్2 తెరకెక్కుతుంది. నెల్సన్ దిలీప్ కుమార్(Nelson Dileep Kumar) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ విద్యా బాలన్(Vidya balan) రజినీకాంత్ సరసన నటిస్తుందని తెలుస్తోంది. జైలర్ సినిమాలో రజినీకాంత్ భార్యగా రమ్యకృష్ణ(Ramya Krishnan) నటించని సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు విద్యా బాలన్ జైలర్2 ఎలా నటిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
జైలర్ సినిమాలో ఉన్నట్టే జైలర్2 లో కూడా శివ రాజ్‌కుమార్(Siva Raj Kumar), మోహన్ లాల్(Mohan Lal), జాకీ ష్రాఫ్(Jocky Shrof) లు నటిస్తున్నారట. వీరితో పాటూ ఈసారి టాలీవుడ్ నుంచి నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) కూడా జైలర్2లో కనిపించనున్నాడని వార్తలొస్తున్నాయి. ఈ సినిమాలో విలన్ గా అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna)ను అనుకుంటున్నారట. కానీ నాగ్ ఈ విషయంలో ఇంకా ఏ విషయం చెప్పలేదని తెలుస్తోంది. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander) సంగీతం అందిస్తున్నాడు.