మారాల్సింది మగవాళ్ల ఆలోచనే : విద్యాబాలన్
బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ తాజాగా మహిళ డ్రెస్సింగ్‌పై నోరువిప్పింది. ఈ మధ్య బాగా హాట్ టాపిక్ అయిన ఈ అంశంపై ఆమె మాట్లాడింది. మహిళ డ్రెస్సింగ్‌పై మారాల్సింది మగవాళ్ల ఆలోచనే. తమకు నచ్చిన వస్త్రాలను అమ్మాయిలు వేసుకుంటారు. వారికి ఇవ్వాల్సిన గౌరవం డ్రెస్సును బట్టి ఉండకూడదు. ఓ మహిళ అలా డ్రెస్ చేసుకోవడానికి ఎన్నో పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగం కూడా కారణం కావచ్చు. ఎక్స్పోజింగ్ చేస్తున్నారని హీరోయిన్‌కు గౌరవం ఇవ్వకుండా ఉంటారా అని విద్యాబాలన్ ప్రశ్నించింది. దేశంలో ప్రతి చోటా ఈవ్ టీజింగ్ జరుగుతోందన్న విద్యాబాలన్.. కొన్ని చోట్ల ఎక్కువ, కొన్ని చోట్ల తక్కువ జరుగుతోంది అంతే.. అని చెప్పింది. అమ్మాయిు భయపడకుండా జీవించాలి. అలాగే తమ సొంత కాళ్లపై నిలబడే ఆర్థిక స్వాతంత్య్రం కూడా చాలా ముఖ్యమని హితబోధ చేసింది.













