ఈ సినిమా నా జీవితాన్నే మార్చేసింది
అలనాటి అందాల తార సిల్క్‌స్మిత జీవితం ఆధారంగా తెరకెక్కిన ది డర్టీ పిక్చర్ బాక్సాపీస్ వద్ద ఏ స్థాయిలో కలెక్షన్లు వసూలు చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విద్యాబాలన్ కెరీర్లో ప్రత్యేకమైన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా విడుదలై ఏడేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆనాటి భావోద్వేగ క్షణాలను పంచుకుంది విద్యాబాలన్. ఏడేళ్ల క్రితం డిసెంబర్ 2, 2011న ది డర్టీ పిక్చర్ విడుదలైంది. ఈ సినిమా నా జీవితాన్నే మార్చేసింది. ఆ పాత్రలో నేను ఎలా చేశానని ప్రతీ సారి ఎవరో ఒకరు నన్ను అడుగుతుంటారు. ఏం చెప్పాలో నాకు తెలియదు. దర్శకడు మిలాన్ లుథ్రియా వల్లే చాలా సులభవంగా సినిమా పూర్తి చేశా. ఈ చిత్రంలో సిల్క్ పాత్రకు న్యాయం చేసేందుకు మిలాన్ అనుక్షణం నా వెంటే ఉండి కృషి చేశారని చెప్పింది విద్యాబాలన్. తుషార్‌కపూర్, ఇమ్రాన్ హష్మీ, నజీరుద్దీన్ షా ప్రధాన పాత్రల్లో నటించారు. విద్యాబాలన్ ఈ సినిమాకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డును అందుకుంది.













