ఆడపులిగా విద్యా బాలన్
విద్యా బాలన్ ఆడపులిలా మారబోతున్నారు. అంటే అంత పవర్‌పుల్‌గా అన్నమాట. షేర్నీ అనే సినిమాలో ఆమె శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నారు. షేర్నీ అంటే అడపులి అని అర్థం. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు జరిగాయి. మర్డర్ 3 (2011), సులేమానీ కీడా (2014), న్యూటన్ (2017) చిత్రాలకు దర్శకత్వం వహించిన అమిత్ మసూర్కర్ ఈ చిత్రానికి దర్శకుడు. న్యూటన్‌కి జాతీయ అవార్డు లభించిన విషయం తెలిసే ఉంటుంది. అలాగే ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో 90వ ఆస్కార్ అవార్డుల నామినేషన్ ఎంట్రీకి మన దేశం తరపున న్యూటన్ వెళ్లింది. ఇప్పుడు ఓ మంచి కథతో అమిత్ షేర్నీ ని తెరకెక్కించనున్నారట. ఈ సినిమాలో నాది మంచి పాత్ర. చాలా థ్రిల్‌గా ఉంది అన్నారు విద్యాబాలన్.













