వెంకటేష్, తేజ మూవీ ప్రారంభోత్సవ వేడుక
విక్టరీ వెంకటేష్, తేజ కాంబినేషన్లో వస్తున్న మూవీ ప్రారంభోత్సవ వేడుక హైదరాబాద్‌లోని రామానాయుడు స్టుడియోలో వైభవంగా జరిగింది. ఈ మూవీ లాంఛ్ కార్యక్రమానికి వెంకటేష్‌తో పాటు రానా, దర్శకుడు తేజ, పరుచూరి బ్రదర్స్ హాజరయ్యారు. దేవుని చిత్రాపటాలపై ముహూర్తపు సన్నివేశాన్ని చిత్రీకరించగా.. హీరో వెంకటేష్ క్లాప్ కొట్టగా రానా గౌరవ దర్శకత్వం వహించారు. అసలు ఈ లాంచింగ్ కార్యక్రమం జనవరి నుండి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. సురేష్ ప్రొడక్షన్, ఏకే ఎంటర్ టైన్ మెంట్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రానికి అభినందన్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. చిత్రానికి సంబంధించి మరిన్ని విషయాలు త్వరలోనే వెల్లడించనున్నారు.













