Vicky Kaushal: విక్కీ రూట్ మార్చాల్సిందే
రీసెంట్ గా వేవ్స్2025 (Waves2025)కు హాజరైన నిర్మాత దినేష్ విజన్(dinesh vijan) ఇండియన్ కల్చర్ లో పాతుకుపోయిన కథల గురించి చెప్పాల్సిన అవసరం ఉందని తెలిపారు. అతని నిర్మాణ సంస్థ మడాక్ ఫిల్మ్స్ లో నిర్మించనున్న మహావతార్ గురించి మాట్లాడుతూ తమ బ్యానర్ లో ఇప్పటివరకు నిర్మించిన అన్ని సినిమాల్లో ఇదే పెద్ద ప్రాజెక్ట్ అని తెలిపాడు.
మహావతార్(mahavthar) మూవీ కూడా హిస్టారికల్ కథతోనే రూపొందుతుంది. ఈ మూవీలో విక్కీ కౌశల్ చిరంజీవి పరశురాముడిగా కనిపించనున్నాడు అయితే గత కొంతకాలంగా విక్కీ కౌశల్(Vicky Kaushal) చేస్తున్న పాత్రలు ఆయనలోని నటుడిని డామినేట్ చేస్తున్నాయనేది అందరికీ తెలిసిన విషయమే. ఆ పాత్రలో ఎవరు నటించినా బ్లాక్ బస్టర్ అయ్యే సినిమాలనే విక్కీ చేసుకుంటూ వస్తున్నాడు.
సామ్ బహదూర్(sam bahdur) లో సామ్ మానేక్షా, ఛావా(Chhava)లో ఛత్రపతి శంభాజీ మహారాజ్ పాత్రలు ఆల్రెడీ చరిత్రలో అందరికీ తెలిసినవి కావడంతో ఆడియన్స్ ఆ పాత్రలో ఎవరు కనిపించినా బాగానే రిసీవ్ చేసుకుంటారు. విక్కీకి బాక్సాఫీస్ పుల్లర్ కాదు, అతని సక్సెస్ లలో ఎక్కువ భాగం ఛావా, ఉరి(URI), సామ్ బహదూర్ లాంటి సినిమాలను సెలెక్ట్ చేసుకోవడం వల్లే దక్కాయి. ఇప్పుడు మహావతార్ కూడా అలాంటిదే కావడంతో విక్కీ ఇక ముందు కూడా ఇలాంటి ప్రయోగాలే చేస్తే ఆయన కేవలం పెర్ఫార్మర్ గా మాత్రమే మిగిలే అవకాశముంది.






