రాళ్లపల్లి ఇకలేరు
టాలీవుడ్లో విషాదం నెలకొంది. సీనియర్ నటుడు రాళ్లపల్లి నరసింహారావు తీవ్ర అనారోగ్యంతో కన్ను మూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ మ్యాక్స్ క్యూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడించారు. కుటుంబ సభ్యులు ఆయన భౌతిక కాయాన్ని మోతీనగర్‌లోని నివాసానకి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన అంత్యక్రియలు నేడు జరిగే అవకాశం ఉంది. రాళ్లపల్లి తన కెరీర్లో సుమారు 800కి పైగా చిత్రాల్లో నటించారు. ప్రతినాయకుడిగా, హాస్యనటుడిగా, క్యాకర్టర్ ఆర్టిస్ట్ గా పాత్ర ఏదైనా ప్రాణప్రతిష్ఠ చేసిన ఘనత ఆయన సొంతం. రాళ్లపల్లి 1945లో తూర్పుగోదావరి జిల్లా రాచపల్లిలో జన్మించారు. ఆయన పూర్తిపేరు రాళ్లపల్లి వెంకట నరసింహారావు. కుక్కకాటుకు చెప్పుదెబ్బ అనే చిత్రంతో సినీ రంగప్రవేశం చేశారు. ఆ విధంగా తన వయసు సహకరించేవరకు దాదాపు 8000 నాటక ప్రదర్శనలు ఇవ్వడం విశేషం అని చెప్పాలి. ఆయన చివరగా నటించిన చిత్రం మారుతి దర్శకత్వంలో నాని హీరోగా వచ్చిన భలేభలే మగాడివోయ్ చిత్రం.













