సీనియర్ నటుడు చంద్రమోహన్ కన్నుమూత
కొంతకాలం గా తెలుగు చిత్ర పరిశ్రమలో వరుసగా విషాదకర సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఎంతో మంది సినీ రంగంలోని ప్రముఖులు ప్రాణాలు విడిచారు.
ఈ ఏడాదిలో కృష్ణంరాజు, కృష్ణ, సత్యనారాయణ వంటి దిగ్గజ నటులను పరిశ్రమ కోల్పోయింది. దీంతో చిత్ర రంగానికి తీవ్ర లోటు ఏర్పడుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో నట శిఖరం నేలకొరిగింది. దాదాపు ఐదు దశాబ్దాలకు పైగానే టాలీవుడ్లో నటుడిగా సత్తా చాటి లెజెండరీ యాక్టర్‌గా పేరొందిన చంద్రమోహన్ కాసేపటి క్రితమే తుది శ్వాసను విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చంద్రమోహన్.. హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం 9.45 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన కొన్నేళ్లుగా గుండె జబ్బుతో బాధపడుతున్నారు. అలాగే ఆయన మధుమేహంతో కూడా బాధపడుతున్నారని సమాచారం. గతకొంతకాలంగా డయాలసిస్ కూడా చేయించుకున్నారు. పలు అనారోగ్య సమస్యలతో బాధపడిన చంద్రమోహన్ తన 78వ ఏట కన్నుమూశారు. ఆయనకు భార్య జలంధర, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చంద్రమోహన్ అంత్యక్రియలు సోమవారం హైదరాబాద్‌లో జరగనున్నాయి.













