టాలీవుడ్ కి మరో షాక్
దేవదాసు చిత్రంలో అంతా భ్రాంతియేనా… జీవితానా వెలుగింతేనా అనే పాటతో పాపులర్ అయిన గాయని కె.రాణి(75) నిన్న రాత్రి 9:10 నిమిషాలకు కన్నుమూశారు. హైదరాబాద్లోని కళ్యాణ్ నగర్లోని తన పెద్ద కుమార్తె విజయ ఇంట రాణి మృతి చెందినట్టు చిన్న కుమార్తె కవిత ధృవీకరించారు. సుమారు 500 పాటలు పాడిన ఆమె శ్రీలంక జాతీయ గీతం కూడా ఆలపించింది. రాష్ట్రపతి భవన్లో తన గానామృతంతో అప్పటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణని ఆకట్టుకున్న ఘనత ఈ మేటి గాయని సొంతం.
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ, సిన్హలా, ఉజ్జెక్ వంటి పలు భాషలలో పాడి అలరించారు రాణి. సిన్హలా, ఉజ్బెక్ భాషలలో పాడిన తొలి ఇండియన్ సింగ్ రాణి. 8 ఏళ్ల వయస్సు నుండే పాడటం ప్రారంభించిన రాణి 1943లో జన్మించింది. రూపవతి అనే తెలుగు చిత్రంతో తన కెరీర్ మొదలు పెట్టింది. బాటాసారి, జయసింహ, ధర్మదేవత, లవకుశ చిత్రాలు ఆమె కెరీర్లో చెప్పుకోదగ్గ చిత్రాలు. రాణి మృతికి టాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.













