వేణుతో ముందుకెళ్లనున్న నాని
సినిమా సినిమాకూ కొత్త దనాన్ని చూపించే నేచురల్ స్టార్ నాని టాలెంటెడ్ డైరెక్టర్లకు ఛాన్సులిస్తూ ఉంటాడు. గతేడాది దసరా సినిమాకు శ్రీకాంత్ ఓదెలకు ఛాన్సిచ్చిన నాని, ఆ తర్వాత వెంటనే శౌర్యువ్ అనే కొత్త దర్శకుడితో హాయ్ నాన్న అనే క్లాస్ సినిమాను చేసి మంచి హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సరిపోదా శనివారం అనే కొత్త జానర్ సినిమాను చేస్తున్నాడు నాని.
ఈ సినిమా తర్వాత నాని ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నానితో హిట్3 తీయాలని శైలేష్ కొలను వెయిట్ చేస్తుండగా, సుజిత్, శ్రీకాంత్ ఓదెల కూడా నానితో సినిమా చేయడానికి కథను రెడీ చేస్తున్నారు. ఈ కాంబోలో సినిమాలు ఫ్యూచర్ లో ఉండే అవకాశాలున్నాయి. కానీ నాని సరిపోదా శనివారం అయిపోగానే బలగం ఫేమ్ వేణు తో సినిమాను చేయనున్నట్లు సమాచారం.
ఇప్పటికే నానికి వేణు ఫుల్ నెరేషన్ ఇచ్చాడని, సరిపోదా శనివారం తర్వాత వెంటనే ఈ సినిమా చేయడానికి నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ఈ సినిమాను దిల్ రాజు బడ్జెట్ పరిమితి లేకుండా నిర్మించనున్నాడు. నానికి దిల్ రాజు బ్యానర్ లో ఇప్పటికే ఎంసీఏ లాంటి మంచి హిట్ ఉంది. త్వరలోనే ఈ కాంబోలో సినిమా గురించి అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.













