వేణు నెక్ట్స్ నానితోనే.. సాక్ష్యం ఇదిగో
బలగం సినిమాతో డైరెక్టర్ గా టాలీవుడ్ కు పరిచయమయ్యాడు కమెడియన్ వేణు ఎల్దండి. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో వేణు తర్వాతి సినిమాను ఎవరితో చేయనున్నాడనే విషయంలో అందరికీ ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు వేణు నుంచి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు. నేచురల్ స్టార్ నానితో సినిమా అన్నారు కానీ దిల్ రాజు నుంచి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.
ఇదిలా ఉంటే హీరో నాని బర్త్ డే సందర్భంగా శిరీష్, హర్షిత్ తో వేణు కూడా కలిసి నాని ఇంటికి వెళ్లి మరీ బర్త్ డే విషెస్ చెప్పాడు. దీంతో ఈ ప్రాజెక్ట్ కు నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన్న విషయం అర్థమైపోతుంది. మామూలుగా అయితే వీరిద్దరితో వేణు స్పెషల్ గా వెళ్లే పని లేదు. నానితో వేణు చేయబోయే సినిమాకు ఎల్లమ్మ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. కానీ ఫైనల్ అయితే కాలేదు.
పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో 80వ దశకంలో ఓ మారుమూల పల్లెటూళ్లో ఎమోషన్స్, ప్రేమ తో డిఫరెంట్ గా వేణు ఈ కథను రెడీ చేశాడట. ఫైనల్ వెర్షన్ రెడీ కాగానే సినిమా గురించి ప్రకటన వచ్చే ఛాన్సుంది. ప్రస్తుతం నాని దృష్టంతా సరిపోదా శనివారం సినిమాపైనే ఉంది. ఈ సినిమా తర్వాత సుజిత్ తో కలిసి ఓ సినిమా చేయనున్నాడు నాని.













