వకీల్ సాబ్ కాంబోలో మరో సినిమా
రీసెంట్ గా వకీల్ సాబ్ సినిమాతో మంచి విజయం అందుకున్న వేణు శ్రీరామ్.. కెరీర్లో మొదటి సారి మంచి మాస్ సక్సెస్ తో తన అకౌంట్ లో వేసుకున్నాడు. ప్రస్తుతం ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న ఆనందంలోనే వేణు శ్రీరామ్ కు మరో బంపరాఫర్ దక్కిందంటున్నారు. వకీల్ సాబ్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన పవన్ కు, దాదాపు మూడేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు సినిమా రావడంతో భారీ విజయాన్ని కట్టబెట్టారు.
నిర్మాత దిల్ రాజు కూడా వకీల్ సాబ్ తో మంచి లాభాలనే వెనుకేసుకున్నట్లు తెలుస్తుంది. వేణు, పవన్, దిల్ రాజు ఈ ముగ్గురి కాంబినేషన్ అంటే వెంటనే వకీల్ సాబ్ సినిమానే గుర్తొస్తుంది. త్వరలోనే ఈ సూపర్ హిట్ కాంబినేషన్ లో మరో సినిమా రానుందని వార్తలొస్తున్నాయి. లేటస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం, పవన్ కళ్యాణ్ కోసం దిల్ రాజు వేణు శ్రీరామ్ తో మరో స్టోరీ రెడీ చేయమని చెప్పినట్లు తెలుస్తుంది.
అందులో భాగంగానే వేణు పవన్ కోసం ఒక స్టోరీ లైన్ ను రెడీ చేశాడని, త్వరలోనే అది పవన్ కు వినిపించనున్నాడని టాక్. వేణు తో పాటూ వేరే డైరక్టర్లకు కూడా దిల్ రాజు కథలు రెడీ చేయమని చెప్పినట్లు తెలుస్తుంది. మరి వాటిలో చివరకు పవన్ ఏ స్టోరీ ఓకే చేస్తాడో చూడాలి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏకే రీమేక్ తో పాటూ, క్రిష్ డైరక్షన్ లో హరిహర వీరమల్లు కూడా చేస్తున్నాడు.













