Venky77: వెంకీ త్రివిక్రమ్ మూవీ షూటింగ్ అప్డేట్

విక్టరీ వెంకటేష్(venkatesh), త్రివిక్రమ్(Trivikram) సినిమాలో కాంబినేషన్ ఎప్పుడెప్పుడొస్తుందా అని టాలీవుడ్ ఆడియన్స్ ఎప్పట్నుంచో వెయిట్ చేస్తున్నారు. వీరిద్దరూ కలిసి గతంలో నువ్వు నాకు నచ్చావ్(Nuvvu naku nachav), మల్లీశ్వరి(Malliswari) సినిమాలకు పని చేసినా ఆ సినిమాలకు త్రివిక్రమ్ కేవలం రైటర్ గా మాత్రమే వర్క్ చేశారు. త్రివిక్రమ్ డైరెక్టర్ అయ్యాక వెంకీ(Venky)తో కలిసి పని చేయలేదు.
అలాంటి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుండటంతో అందరికీ ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. వెంకటేష్ కెరీర్లో 77వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను హారికా హాసినీ క్రియేషన్స్(Haarika Haassine creations) బ్యానర్ లో ఎస్. రాధాకృష్ణ(Radhakrishna) నిర్మిస్తున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఒకటి ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.
వెంకీ77(venky77) వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ మూవీ సెప్టెంబర్ రెండో వారం నుంచి సెట్స్ పైకి వెళ్లనుందని, ఈ మూవీలో వెంకటేష్ సరసన ఇద్దరు హీరోయిన్లు నటించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అయితే ఆ ఇద్దరి హీరోయిన్ల కోసం రుక్మిణి వసంత్(rukmini vasanth), నిధి అగర్వాల్(niddhi agerwal), త్రిష(Trisha) పేర్లను పరిశీలిస్తున్నారని అంటున్నారు. వెంకీతో తీస్తున్న మొదటి సినిమా కావడంతో త్రివిక్రమ్ ఈ సినిమా కోసం మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారట.