విజయదశమి సందర్భంగా వెంకీ మామ టీజర్
దగ్గుబాటి, అక్కినేని హీరోలు కలసి నటిస్తున్న వెంకీ మామ చిత్రం టీజర్‌ను విజయదశమి సందర్భంగా విడుదల చేశారు. ప్రేక్షకుల నుంచి ఈ టీజర్‌కు అద్భుతమైన స్పందన వస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు. ఈ వీడియో ప్రస్తుతం యూ ట్యూబ్‌లో అగ్రస్థానంలో ట్రెండ్ అవుతోంది. మామ, అల్లుడు పాత్రలో వీరిద్దరు అద్బుతంగా ఒదిగిపోయారని దర్శకుడు కేఎస్ రవీంద్ర (బాబీ) చెప్పారు. వెంకటేశ్, నాగచైతన్య కెమిస్ట్రీ ఈ టీజర్‌కు ప్రధానమైన హైలైట్ అని ఆయన తెలిపారు. రాశీ ఖన్నా, పాయల్ రాజ్‌పుత్ ఈ చిత్రకథానాయికలు. సురేశ్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకలపై సురేశ్ బాబు, టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.













