మెగాస్టార్ చిరంజీవితో చలో, భీష్మ దర్శకుడి చిత్రం ఉంటుందా? ఊడుతుందా?
టాలీవుడ్ సీనియర్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన దగ్గరున్న సినిమాల లైనప్ ఇప్పుడు కుర్ర హీరోల దగ్గర కూడా లేదంటే నిజమని అనక తప్పదు. తాజాగా.. ఆయన లిస్టులోని ఓ సినిమా ఆగిపోయిందంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అసలు ఇంతకీ ఏం జరిగింది. చిరంజీవి వెంకీ కుడుముల కాంబినేషన్లో సినిమాను ప్రముఖ నిర్మాత డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారన్నది తెలిసిందే! ఈ ప్రకటన వచ్చిన తరువాత వెంకీ కుడుముల స్క్రిప్ట్ వర్క్‌పై కూర్చున్నాడట. స్క్రిప్ట్ అంతా ఓకే అని అనుకున్న తర్వాత మరోసారి చిరంజీవిని కలిశాడు. అయితే ఈ స్క్రిప్ట్ చిరంజీవికి అంతగా నచ్చలేదట. ఆయన కొన్ని సందేహాలను వ్యక్తం చేసి మళ్లీ వర్కవుట్ చేయమని చెప్పారట. దీంతో వెంకీ కుడుముల స్క్రిప్ట్‌పై మళ్లీ వర్క్ చేయటం ప్రారంభించాడట.
దీంతో చిరంజీవి, వెంకీ కుడుముల ప్రాజెక్ట్ ఫాస్జ్ ఐయ్యిందని తెలుస్తోంది. కాదు ఆగిపోయిందంటూ వార్తలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. మరి ఈ వార్తలపై వెంకీ కుడుముల ఏమైనా రియాక్ట్ అవుతాడేమో చూడాలి మరి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య అనుకున్న రేంజ్ లో రన్ రాలేదు. ఇప్పుడు గాడ్ ఫాదర్ సినిమా సెట్స్‌పై ఉంది. మలయాళ చిత్రం లూసిఫర్‌కి ఇది రీమేక్. మోహన్ రాజా ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ ఏడాదిలోనే ఈ సినిమా రిలీజ్ ఉండొచ్చునని సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న టాక్. ఇది కాకుండా మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా ఓ వైపు.. బాబి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ రూపొందిస్తోన్న వాల్తేరు వీరయ్య సినిమా మరో వైపు రూపొందుతున్నాయి.













