టైటిల్‌తోనే బజ్ పెంచేస్తున్న వెంకీ
ఈ సంక్రాంతికి సైంధవ్ సినిమాతో డిజాస్టర్ అందుకున్నాడు విక్టరీ వెంకటేష్. వెంకీ కెరీర్ లో 75వ సినిమాగా భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమా అంచనాలను అందుకోవడంలో ఘోరంగా విఫలమైంది. దీంతో వెంకీ తన తర్వాతి సినిమా విషయంలో ఆచితూచి వ్యవహరించాలని కాస్త గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పుడు వెంకీ తన తర్వాతి సినిమాను అనిల్ రావిపూడితో చేయనున్నాడు.
ఈ సినిమా గురించి కొన్నాళ్ల కిందటే అనౌన్స్మెంట్ వచ్చింది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతుంది. ఈ సినిమాకు సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు ముందుగానే అనౌన్స్ చేశారు. ఇప్పుడు టైటిల్ కూడా దానికి రిలేట్ అవుతుండటంతో సినిమాకు బజ్ పెరగడం ఖాయం.
నార్మల్ గా అయితే నాగార్జున తనకు సంక్రాంతిని సెంటిమెంట్ గా భావించి, సినిమాలను సంక్రాంతికి షెడ్యూల్ చేసి సంక్రాంతికి వస్తున్నాం, కొడుతున్నామని చెప్తుంటాడు. కానీ ఇప్పుడా టైటిల్ ను వెంకీ కొట్టేయడం విశేషం. ఇలాంటి టైటిల్ పెట్టి సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తే ఆటోమేటిక్ గా బజ్ పెరగడం ఖాయం. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఇంప్రెస్ చేసే టైటిల్ అవుతుంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించనుండగా అందులో ఓ హీరోయిన్ గా మీనాక్షి చౌదరి ఫైనల్ అవగా, మరో హీరోయిన్ కోసం వెతుకుతున్నారు. జూన్ లేదా జులై నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించనున్నాడు.













