Venky Atluri: సార్ తో మరో ప్రయోగం చేయనున్న వెంకీ
కెరీర్ మొదట్లో ప్రేమ కథలని తీసిన వెంకీ అట్లూరి(Venky Atluri) తొలి ప్రేమ(Tholi Prema) సినిమాతో తప్పించి మరే ప్రేమ కథతోనూ హిట్ అందుకోలేకపోయాడు. దీంతో ట్రాక్ మార్చి పీరియడ్ ఫిల్మ్స్ పేరుతో 80, 90 దశకంలోకి తీసుకెళ్లి మంచి హిట్లు అందుకోవడం మొదలుపెట్టాడు. రీసెంట్ గా వెంకీ దర్శకత్వంలో వచ్చిన లక్కీ భాస్కర్(Lucky Baskhar) ఏ రేంజ్ లో హిట్టయిందో చూశాం.
లక్కీ భాస్కర్ కు ముందు ధనుష్(Dhanush) తో తీసిన సార్(Sir) సినిమా కూడా మంచి ప్రశంసలతో పాటూ కలెక్షన్లను కూడా రాబట్టుకుంది. అయితే ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ రిపీటవనుందని తెలుస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్(Sithara Entertainments) బ్యానర్ లోనే ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి మరో సినిమాను చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమాకు హానెస్ట్ రాజ్(Honest Raaj) అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారని ఇన్సైడ్ టాక్.
నిజాయితీకి మారు పేరైన ప్రభుత్వ ఉద్యోగి చుట్టూ ఈ కథ తిరుగుతుందని, ఈ కథను కూడా వెంకీ అట్లూరి వెనుకటి నేపథ్యంతోనే తెరకెక్కించనున్నాడని తెలుస్తోంది. లక్కీ భాస్కర్ లో బ్యాంక్ ఉద్యోగి చేసే అవినీతిని చూపించి అందరినీ ఇంప్రెస్ చేసిన వెంకీ ఈసారి నిజాయితీ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. త్వరలోనే ఈ ప్రాజెక్టు గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు తెలుస్తోంది.













