Venky Atluri: ప్రతీ కథ ముందు ఆ హీరోకే చెప్తా

తొలి ప్రేమ(tholi prema) సినిమాతో డైరెక్టర్ గా కెరీర్ ను మొదలుపెట్టిన వెంకీ అట్లూరి(veky atluri) ఆ తర్వాత మిస్టర్ మజ్ను(mr.majnu), రంగ్ దే(rang de) సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించి వాటితో యావరేజ్ ఫలితాల్ని అందుకున్నాడు. ఆ తర్వాత సార్(sir), లక్కీ భాస్కర్(Lucky baskhar0 తో అందరి చూపునీ తన వైపుకు తిప్పుకున్న వెంకీ అట్లూరి ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(suriya)తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
ప్రేమలు(Premalu) హీరోయిన్ మమిత బైజు(mamitha byju) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్(sithara entertainments) నిర్మిస్తుండగా, ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ నిర్విరామంగా జరుగుతుంది. ఇదిలా ఉంటే రీసెంట్ గా ఓ మీడియా ఇంటరాక్షన్ లో వెంకీ అట్లూరి ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. తాను రాసుకున్న స్క్రిప్టులను తాను ముందుగా అక్కినేని నాగ చైతన్య(akkineni naga chaitanya)కు చెప్తానని తెలిపాడు.
మరి ఇద్దరి మధ్య అంత సాన్నిహిత్యం ఉన్నప్పుడు కలిసి సినిమా ఎందుకు చేయలేదని అడగ్గా, దానికి షెడ్యూల్ విభేదాలు, ప్రాక్టికల్ ఇబ్బందులే కారణమని తెలిపాడు. వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ను చూశాక ఫ్యూచర్ లో అయినా ఇద్దరూ కలిసి సినిమా చేస్తారని అక్కినేని ఫ్యాన్స్ ఆశ పడుతున్నారు. ఇదిలా ఉంటే నాగ చైతన్య ప్రస్తుతం తన 24(NC24)వ ప్రాజెక్టును కార్తీక్ దండు(karthik dandu) దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే.