Venky Atluri-Suriya: వెంకీ- సూర్య మూవీ లేటెస్ట్ అప్డేట్
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Suriya) తెలుగు సినిమాకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. అప్పుడెప్పుడో రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) రక్త చరిత్ర2 (Raktha Charithra2)లో నటించిన సూర్య, ఆ తర్వాత మరో తెలుగు సినిమా చేసింది లేదు. మధ్యలో తెలుగు డైరెక్టర్లు వెళ్లి ఆయన్ని కలిసి కథలు చెప్తున్నా తమిళంలో ఒప్పుకున్న సినిమాల వల్ల సూర్యకు ఇప్పటివరకు తెలుగు సినిమా చేయడానికి కుదరలేదు.
అయితే ఇప్పుడు టాలీవుడ్ నిర్మాత నాగవంశీ(Naga Vamsi) దాన్ని సెట్ చేసినట్టు తెలుస్తోంది. వెంకీ అట్లూరి(Venky Atluri) దర్శకత్వంలో సూర్యతో సినిమా చేయడానికి నాగ వంశీ లైన్ క్లియర్ చేశాడని సమాచారం. ఇప్పటికే వెంకీ సూర్యకు కథ చెప్పాడని, సూర్య దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టు కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తోంది.
మే నుంచి ఈ మూవీ పట్టాలెక్కబోతుందని, ఈ సినిమాలో హీరోయిన్ ను కూడా ఫిక్స్ చేశారని అంటున్నారు. భాగ్య శ్రీ బోర్సే(Bhagya Sri Borse) ను సూర్య సరసన హీరోయిన్ గా నటించడానికి ఫైనల్ చేశారట. జి. వి ప్రకాష్ కుమార్(GV Prakash Kumar) ఈ సినిమాకు సంగీతం అందించనున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే వెంకీ దీనికి సంబంధించిన స్క్రిప్ట్ ను కూడా లాక్ చేశారని అంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంతన్నది తెలియాల్సి ఉంది.













