Venkitesh: అమ్మ ముందే చెప్పింది
బ్యాక్ గ్రౌండ్ ఆర్టిస్టుగా కెరీర్ స్టార్ట్ చేసిన మలయాళ నటుడు వెంకిటేష్(Venkitesh) తక్కువ కాలంలోనే టాలీవుడ్ లో తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమాలో విలన్ గా నటించే అవకాశం అందుకున్నాడు. కేవలం ఛాన్స్ అందుకోవడమే కాకుండా దాన్ని చాలా తెలివిగా ఉపయోగించుకుని మొదటి సినిమాతోనే ఆడియన్స్ ను మెప్పించి వారిని తన యాక్టింగ్ తో ఫిదా చేశాడు.
విజయ్ దేవరకొండ(Vijay devarakonda) హీరోగా తెరకెక్కిన కింగ్డమ్(kingdom) సినిమాలో విలన్ గా నటించి మంచి పాపులారిటీని అందుకున్న వెంకిటేష్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన గురించి ఎవరికీ తెలియని విషయాలను వెల్లడించాడు. తన ఫ్యామిలీ మొత్తం తలైవార్ కు పెద్ద ఫ్యాన్స్ అని, ఆయన సినిమా చూస్తూ ఓ రోజు తాను హీరో అవుతానని తన తల్లితో చెప్పగా, కాదు కాదు నువ్వు విలన్ అవాలనుకుంటున్నావని చెప్పిందని తెలిపాడు.
అదృష్టవశాత్తూ కేరళలోని ఓ పెద్ద థియేటర్లో తన తల్లి మూవీ చూడ్డానికి వెళ్లినప్పుడు అక్కడ తన ఎంట్రీ సీన్ కు క్లాప్స్ కొట్టడం చూసి తన తల్లి ఎంతో సంతోషించిందని, సినిమాలోని తన యాక్టింగ్ తో పాటూ మూవీ కూడా ఎంతగానో నచ్చిందని, తనను చూసి గర్వ పడుతున్నానని తన తల్లి తనకు ఫోన్ చేసి చెప్పిందని వెంకిటేష్ వెల్లడించాడు.







