Venkatesh: నెక్ట్స్ ఇయర్ లో వెంకీ నుంచి మూడు సినిమాలు

టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్(venkatesh) ప్రస్తుతం వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. ఈ ఇయర్ ఇప్పటికే సంక్రాంతికి వస్తున్నాం (sankranthiki vasthunnam) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి ఆ సినిమాతో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న వెంకటేష్, ఆ సక్సెస్ ఇచ్చిన జోష్ లో వరుస సినిమాలను లైన్ లో పెట్టారు. అందులో భాగంగానే తన తర్వాతి సినిమాను త్రివిక్రమ్(trivikram) తో చేస్తున్నారు.
ఇప్పటికే పూజా కార్యక్రమాలతో మొదలైన వెంకీ(venky)- త్రివిక్రమ్ సినిమా సెప్టెంబర్ నెలాఖరు నుంచి సెట్స్ పైకి వెళ్లి షూటింగ్ జరుపుకోనున్నట్టు తెలుస్తోంది. త్రివిక్రమ్ సినిమాతో పాటూ వెంకీ మరో సినిమాను కూడా ఒప్పుకున్నాడు. అదే మన శంకరవరప్రసాద్ గారు(Mana Shankaravaraprasad Garu). మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) హీరోగా అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వెంకీ గెస్ట్ రోల్ చేస్తున్నారు.
ఈ రెండూ కాకుండా నవంబర్ నుంచి బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజ్ దృశ్యం3(Drishyam3)ను సెట్స్ పైకి తీసుకెళ్లి ఆ సినిమా షూటింగ్ ను చేయనున్నాడు వెంకీ. మొత్తానికి మూడు సినిమాలతో ఈ ఇయర్ అంతా వెంకీ షెడ్యూల్ చాలా బిజీగా ఉంది. ఈ ఇయర్ మొత్తం ఈ మూడు సినిమాలను పూర్తి చేసి వచ్చే ఏడాది ఆ మూడు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని గట్టి ప్లానే వేస్తున్నారు వెంకీ. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ రోజుల్లో కుర్ర హీరోలకు కూడా సాధ్యపడని విధంగా ఒకే సంవత్సరంలో మూడు సినిమాలు రిలీజ్ చేసిన హీరోగా వెంకీ రికార్డు సాధిస్తారు.