MSG: చిరూ తో వెంకీ జాయిన్ అయ్యేది ఎప్పుడంటే?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi) హీరోగా, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(anil ravipudi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా మన శంకరవరప్రసాద్ గారు(Mana Shankaravaraprasad Garu). ఆల్రెడీ ఈ సినిమాపై ఆడియన్స్ లో మంచి ఇంట్రెస్ట్ నెలకొంది. లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanthara) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్(venkatesh) ఓ గెస్టు రోల్ లో కనిపించనున్న విషయం తెలిసిందే.
మన శంకరవరప్రసాద్ గారు షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా అక్టోబర్ 21 నుంచి వెంకటేష్(Venkatesh) కూడా షూటింగ్ లో జాయిన్ అవనున్నట్టు తెలుస్తోంది. మూవీలో వెంకీ క్యారెక్టర్ ను అనిల్ చాలా ఫన్నీగా, ఎమోషనల్ ఎలిమెంట్స్ తో డిజైన్ చేశారని చెప్తున్నారు. చిరంజీవి, వెంకటేష్ ఇద్దరూ స్క్రీన్ పై కలిసి కనిపించనుండటంతో వీరి కాంబినేషన్ పై మంచి హైప్ నెలకొంది.
వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఆల్రెడీ మేకర్స్ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఫస్ట్ లిరికల్ మీసాల పిల్ల(meesala Pilla) ప్రోమోను రిలీజ్ చేశారు. దసరా సందర్భంగా రిలీజ్ చేసిన ఈ ప్రోమోకు ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వస్తుంది. ఈ ప్రోమోలో చిరూ, నయన్ మధ్య వచ్చిన సీన్స్ ఆడియన్స్ ను ఆకట్టుకోగా త్వరలోనే ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. భీమ్స్ సిసిరోలియో(Bheems Ciciroleo) ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.