విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల మూవీ ముందుగా సెట్ పైకి వెళుతుందా?
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఆల వైకుంఠపురంలో… బ్లాక్ బస్టర్ తో ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. ‘అజ్ఞాతవాసి’ సినిమాతో ఊహించని డిజాస్టర్ అందుకున్న త్రివిక్రమ్ ఆ తరువాత చేసిన ‘అరవింద సమేత’ కూడా అనుకున్నంతగా హిట్ కాలేదు . అల.. వైకుంఠపురములో.. సినిమాతో త్రివిక్రమ్ తన స్టయిల్ల్లో కమర్షియల్ ఫార్మాట్ స్టోరీ ని అందించి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. చాలా చోట్ల ఆ సినిమా నాన్ బాహుబలి రికార్డులను బ్రేక్ చేసిన విషయం తెలిసిందే. రాబోయే సినిమాతో కూడా అదే స్థాయిలో సక్సెస్ అందుకోవాలని త్రివిక్రమ్ జూనియర్ ఎన్టీఆర్ తో ఒక సినిమాను ఫిక్స్ చేసుకున్నాడు. ఎన్టీఆర్ 30 వ చిత్రంగా కళ్యాణ్ రామ్, ఎస్.రాధా కృష్ణ (చినబాబు) సంయుక్తంగా సినిమాను నిర్మించాలని ఆఫీసియల్ గా ప్రకటన కూడా ఇచ్చారు. టైటిల్ కూడా ‘అయినాను వెళ్లి రావాలె హస్తినకు’ అనుకున్నారు.
దాదాపు షెడ్యూల్స్ సెట్ చేసుకుంటున్న తరుణంలో లాక్ డౌన్ కారణంగా అన్ని పనులు మళ్ళీ మొదటికొచ్చాయి. ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో ఎవరు ఊహించని విధంగా ఒక వార్త వైరల్ గా మారింది. ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా ప్రస్తుతానికి ఆగిపోయిందనే టాక్ వస్తోంది. దాదాపు 100కోట్ల బడ్జెట్ తో సెట్టయిన సినిమా సడన్ గా ఆగిపోవడం ఏమిటని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక ఈ రూమర్స్ పై ఇంతవరకు చిత్ర యూనిట్ సైడ్ నుంచి క్లారిటీ అయితే రాలేదు. సినిమాపై వస్తున్న రూమర్స్ ఆడియెన్స్ లో కన్ఫ్యూజన్ కి గురి చేస్తున్నాయి.
జూనియర్ ఎన్టీఆర్ RRR సినిమా పనులు పూర్తి అవ్వడానికి ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి, రాజమౌళి రాంచరణ్ రాజమౌళి లా పాన్ ఇండియా మూవీ కావడంతో సినిమా షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు అవ్వడానికి చాలా సమయం పడుతుంది అవన్నీ పూర్తి అయ్యాక ఎన్టీఆర్ తో కొత్త సినిమాను స్టార్ట్ చేయాలని త్రివిక్రమ్ ప్లాన్ చేసుకుంటున్నాడట. ఈ మద్య కాలం లో వెంకటేష్ తో ఒక సినిమాను పూర్తి చేయాలని అనుకుంటున్నట్లు ఇటీవల త్రివిక్రమ్ తారక్ తో అన్నారట. ఈ విషయంతో ఎన్టీఆర్ కాస్త సందేహంలో పడ్డట్లు తెలుస్తోంది. RRRకి ఎన్టీఆర్ వర్క్ అవసరం ఉన్నప్పటికీ ఆ పనులు పూర్తి చేయడానికి మధ్య మధ్య లో సమయం దొరుకుతుంది. ప్లాన్ ప్రకారం చేసుకుంటే RRR పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్స్ పనులతో పాటు త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ని కూడా చేయడానికి అంత కష్టమైన పనేం కాదు. కానీ త్రివిక్రమ్ మాత్రం సడన్ గా తన ప్లాన్ మార్చుకొని వెంకటేష్ తో సినిమా చేయాలని డిసైడ్ అయ్యారట. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే మరి.













