24న వెంకటేశ్ కుమార్తె వివాహం
ప్రస్తుతం వెంకీ మామ చిత్రంలో నటిస్తున్న ప్రముఖ కథానాయకుడు వెంకటేష్ నిజ జీవితంలోనూ మామ కాబోతున్నారు. వెంకటేష్ ప్రథమ కుమార్తె ఆశ్రిత వివాహం హైదరాబాద్ రేస్ క్లబ్ ఓనర్ సురేంద్రరెడ్డి తనయుడు వినాయకరెడ్డితో ఈ నెల 24న రాజస్థాన్‌లోని ప్యాలెస్ హోటల్లో జరగనుంది. ఈ పెళ్లికి భారీగా ఏర్పాట్లు చేశారు. వీరిది ఇరువైపుల పెద్దలు ఆమోదించిన ప్రేమ పెళ్లి. ఈ నెల 28న వివాహ రిసెప్షన్ హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించనున్నారు. రాాజస్థాన్లో జరిగే డిస్టినేషన్ వెడ్డింగ్‌కి ఇరు కుటుంబాలకు చెందిన అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నారు. విందుకు పరిశ్రమ వర్గాలతో పాటు, అభిమానులను పెద్ద సంఖ్యలో ఆహ్వానించే అవకాశముంది.













