వెంకటేష్ కూతురు ప్రేమ పెళ్లి ?
సినిమా పరిశ్రమలో ప్రేమ పెళ్లిళ్లు సాధారణమే. ఇప్పటికే ఎంతో మంది తారలు ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్నారు కూడా. ఈ క్రమంలోనే ప్రముఖ నటుడు విక్టరీ వెంకటేష్ కూతురు ఆశ్రిత ప్రేమ పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి. ఆశ్రిత ప్రేమ పెళ్లికి వెంకటేష్‌తో పాటు ఆయన కుటుంబం కూడా అంగీకరించినట్టు సమాచారం. వెంకటేష్‌కు కూతురు ఆశ్రితతో పాటు కొడుకు అర్జున్ కూడా ఉన్నారు. ఇప్పటి వరకు వెంకటేష్ తన కుటుంబాన్ని పెద్దగా బయట ప్రపంచానికి చూపించలేదు. ఆశ్రిత బేకరి రంగంలో వృత్తి నిపుణురాలిగా శిక్షణ తీసుకున్నారు. ఓ ప్రముఖుడి కొడుకుతో చదువుకునే రోజుల నాటి నుంచే ఆమె ప్రేమలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఆశ్రిత నిశ్చితార్థ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమచారం.













