Venkatesh: రానా నాయుడు2 కు వెంకీ హామీ
విక్టరీ వెంకటేష్(Venkatesh) కెరీర్లోనే ఫస్ట్ వెబ్ సిరీస్‌గా వచ్చిన రానా నాయుడు(Rana Naidu)కు వ్యూస్ పరంగా చెప్పుకుంటే చాలా మంచి హిట్టనే చెప్పాలి. కానీ కంటెంట్ పరంగా మాత్రం దానిపై చాలానే విమర్శలొచ్చాయి. కథ కథనాలు బోల్డ్ గా ఉండటంతో పాటూ తెలుగు డబ్బింగ్ లో కూడా బూతులు ఎక్కువగా ఉండటం ఆడియన్స్ కు షాకిచ్చింది.
ఫ్యామిలీల్లో వెంకీకి మంచి ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ఆ నేపథ్యంలోనే వెంకీ ఫ్యామిలీ హీరో కదా అని వెబ్ సిరీస్ చూద్దామనుకున్న ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ ఆ సిరీస్‌తో వెంకీ షాకిచ్చాడు. ఇదంతా దర్శకనిర్మాతల దృష్టికి వెళ్లి సీజన్2 విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఇప్పటికే వార్తలొచ్చాయి.
అయితే రానా నాయుడు వచ్చిన నెగిటివిటీ తన దృష్టికి రాలేదని, సీక్వెల్ కోసం అంత అడల్ట్ కంటెంట్ లేకుండా ఆ డోస్‌ను తగ్గించినట్టు వెంకీ సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunnam) ప్రెస్ మీట్ లో తెలిపాడు. ఇప్పటికే రానా నాయుడు2(Rana Naidu20 షూటింగ్ ఆల్మోస్ట్ ఫినిష్ అయింది. స్ట్రీమింగ్ ఎప్పుడనేది మాత్రం నెట్ ఫ్లిక్స్ ఇంకా అనౌన్స్ చేయలేదు. ఏదేమైనా స్టార్ హీరోలు వెబ్ సిరీస్‌లు చేసేటప్పుడు మాత్రం కంటెంట్ విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఓకే చేయాలి.













