ఆ సినిమా సీక్వెల్ చేస్తానంటున్న వెంకీ
విక్టరీ వెంకటేష్ కెరీర్లో బొబ్బిలి రాజా సినిమా అనేది చాలా ప్రత్యేకం. వెంకీ హీరోగా బి.గోపాల్ డైరెక్షన్లో తెరకెక్కిన బొబ్బిలి రాజా అప్పట్లో సంచలనాలు సృష్టించింది. రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో మ్యూజిక్ పరంగానూ ఓ ఊపు ఊపింది. ఇళయరాజా అందించిన పాటలు ప్రేక్షకుల్ని మైమరింపచేశాయి.
దీంతో బొబ్బిలిరాజా క్లాసిక్ హిట్ గా నిలిచిపోయింది. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమాలో దివ్య భారతి హీరోయిన్ గా నటించింది. ఇక అసలు మ్యాటర్ లోకి వెళ్తే, రీసెంట్గా సైంధవ్ టీజర్ లాంచ్ ఈవెంట్ లో భాగంగా వెంకటేష్ కు మీ సినిమాలన్నింటిలో సీక్వెల్ చేయాలంటే ఏ సినిమా చేస్తారనే ప్రశ్న ఎదురైంది.
దానికి వెంకీ మరో ఆలోచన లేకుండా వెంటనే బొబ్బిలి రాజా సినిమా పేరు చెప్పాడు. ఆయన ఇప్పటి వరకు చేసిన 74 సినిమాల్లో బొబ్బిలి రాజా పేరే చెప్పాడంటే ఆ సినిమాకు సీక్వెల్ చేయాలన్న కోరిక వెంకీలో బలంగానే ఉన్నట్లు కనిపిస్తుంది. మరి ఈ అవకాశాన్ని వాడుకుని ఏ డైరెక్టర్ ఆయన దగ్గరకు సీక్వెల్ కథతో వెళ్లి సినిమా చేస్తారో చూడాలి.













