వెంకటేష్ ఇంట్లో పెళ్లి సందడి
అగ్ర కథానాయకుడు వెంకటేష్ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. వెంకీ పెద్దకుమార్తె ఆశ్రిత వివాహం మార్చి నెలాఖరున జరగబోతోంది. ఇటీవల మైదరాబాద్లో కుటుంబ సభ్యులు, పరిమిత సంఖ్యలో సన్నిహితుల సమక్షంలో నిశ్చితార్థ వేడుకని నిర్వహించారు. హైదరాబాద్కి చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్త వారసుడైన వినాయక్ రెడ్డితో ఆశ్రితకి నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తోంది. వినాయక్ రెడ్డి వృతి రీత్యా ఇంజినీర్ అని సమాచారం. పెళ్లి వేడుక విదేశాల్లో జరగొచ్చని, విందు కార్యక్రమాన్ని హైదరాబాద్లోనే జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది.













