ఎఫ్ 2 ఫస్ట్ లుక్ విడుదల
వెంకటేష్, వరుణ్‌తేజ్ కథానాయకులుగా నటిస్తున్న చిత్రం ఎఫ్ 2. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అనేది ఉపశీర్షిక. తమన్నా, మెహరీన్ కథానాయికలు. అనిల్ రావిపూడి దర్శకుడు. దిల్‌రాజు నిర్మాత. సోమవారం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ మా సంస్థ ముందు నుంచీ కుటుంబ కథా చిత్రాలకే ప్రాధాన్యం ఇస్తోంది. ఎఫ్ 2 కూడా అలాంటి చిత్రమే. ఓ చక్కటి సందేశానికి, అన్ని రకాల కమర్షియల్ హంగులూ జోడించి, వినోదాల యాత్రగా తీర్చిదిద్దారు దర్శకుడు. 80 శాతం చిత్రీకరణ పూర్తయింది. క్లైమాక్స్, మూడు పాటలు మాత్రమే తెరకెకిల్కించాల్సి ఉంది. వెంకటేష్, వరుణ్ తోడల్లుళ్లుగా నటిస్తున్నారు. ఈ సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తామన్నారు.













