GOAT: గోట్ సీక్వెల్ పై డైరెక్టర్ సెటైరికల్ ఆన్సర్
గతేడాది వెంకట్ ప్రభు(Venkat Prabhu) దర్శకత్వంలో దళపతి విజయ్(Dalapathy Vijay) హీరోగా వచ్చిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్(The Greatest Of All Time) మూవీకి ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. సినిమాకు మిక్డ్స్ టాక్ వచ్చినప్పటికీ కోలీవుడ్ లో ఈ మూవీ భారీ కలెక్షన్స్ ను అందుకుంది. అయితే గోట్(GOAT) క్లైమాక్స్ లో దానికి సీక్వెల్ ఉంటుందని కూడా అనౌన్స్ చేశారు. ఈ సీక్వెల్ కు గోట్ వర్సెస్ ఓజి(GOAT vs OG) అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు.
ఇదిలా ఉంటే రీసెంట్ గా డైరెక్టర్ వెంకట్ ప్రభు ఓ అవార్డ్స్ ఫంక్షన్ కు వెళ్లగా అక్కడ యాంకర్ గోట్ సీక్వెల్ ఎప్పుడుంటుందని ఆ మూవీ గురించి అప్డేట్ అడిగారు. దానికి వెంకట్ ప్రభు 2026 తర్వాత దానిపై అప్డేట్ ఇస్తానని సెటైరికల్ గా సమాధానమిచ్చారు. దీంతో ఆయన మాటల్ని ఒక్కొక్కరు ఒక్కోలా అర్థం చేసుకుంటూ ఆయన చేసిన కామెంట్స్ ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
వెంకట్ మాటల్ని బట్టి విజయ్ 2026 ఎలక్షన్స్ లో ఎలాగూ గెలవడని కాబట్టి మళ్లీ సినిమాల్లోకి వస్తాడని అందుకే 2026 తర్వాత గోట్ సీక్వెల్ పై క్లారిటీ ఇస్తానన్నారని కొందరంటుంటే, ఆ మూవీకి ఎలాగూ సీక్వెల్ ఉండదని ఆయనకు కూడా తెలుసు అందుకే అలా కావాలని సెటైరికల్ గా చెప్పారని మరికొందరు అంటున్నారు. ఇంకొందరైతే విజయ్ మళ్లీ సినిమాల్లోకి వస్తాడులే అని సంతోషంగా ఫీలవుతున్నారు. ఇదిలా ఉంటే విజయ్ ప్రస్తుతం తన 69వ సినిమా జన నాయగన్(Jananayagan)ను హెచ్. వినోత్(H.Vinoth) దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకైతే విజయ్ నటించే ఆఖరి సినిమా ఇదేనని ప్రచారం జరుగుతుంది.













