రచయిత, సీనియర్ జర్నలిస్ట్, భగీరధను అభినందించిన వెంకయ్య నాయుడు
సీనియర్ జర్నలిస్ట్, రచయిత భగీరథను భారత మాజీ ఉప రాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు అభినందించారు. మహానటుడు, తెలుగు దేశం వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా రామారావు గారితో చేసిన ఇంటర్వ్యూ లు, ఆయన తో వున్న అనుభవాలతో భగీరథ “మహానటుడు, ప్రజానాయకుడు – ఎన్ .టి .ఆర్” అన్న పుస్తకాన్ని వెలువరించాడు. ఈ పుస్తకాన్ని శుక్రవారం రోజు వెంకయ్య నాయుడు గారిని హైదరాబాద్ లో కలసి బహూకరించాడు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు గారు ఎన్.టి .ఆర్ తో తనకున్న అనుభవాలను గుర్తు చేసుకున్నారు. సినిమా రంగంలోనూ, రాజకీయ రంగంలోనూ ఎన్ .టి .ఆర్ చెరిగిపోని ముద్ర వేశారని, ఆయన ఎప్పటికీ స్ఫూర్తి ప్రదాత అని పేర్కొన్నారు. మహా నటుడు, ప్రజానాయకుడు ఎన్.టి.ఆర్ శత జయంతి సందర్భంగా ఆయన మీద ఓ పుస్తకాన్ని వెలువరించిన జర్నలిస్ట్, రచయిత భగీరధను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు అభినందించారు.













